ప్రో కబడ్డీ వేలం.. ఐపీఎల్ రేంజ్లో ధర పలికిన ఆటగాళ్లు?

praveen
భారత్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన గేమ్ ఏది అంటే ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట క్రికెట్ అని మాత్రమే. క్రికెట్ విదేశీ ఆట అయినప్పటికీ ఇక భారత్లో మాత్రం ఎక్కడా లేనంత ప్రేక్షకాదరణ పొందింది. ఇందువల్లనే ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న స్థాయికి ఎదిగింది అని చెప్పాలి. అయితే ఆ తర్వాత ఆ రేంజిలో గుర్తింపును సంపాదించుకుంది మాత్రం కబడ్డీ అనే చెప్పాలి. కబడ్డీ అనేది ప్రతి ఒక్కరికి చేరువయ్యే ఆట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు ఏదో ఒక సమయంలో కబడ్డీ ఆడి ఉంటారు. ఈ క్రమంలోనే ఇక కబడ్డీ ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభించారు.

 ఇక ఎవరూ ఊహించని విధంగా ప్రో కబడ్డీ లీగ్ కి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది అనే విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఏకంగా విజయవంతంగా 8 సీజన్లు పూర్తిచేసుకుంది ప్రో కబడ్డీ. మరికొన్ని రోజుల్లో ఇక 9 వ సీజన్  కూడా ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే ప్రో కబడ్డీ లీగ్ కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు  మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా దక్కించుకున్నారు.  అయితే ప్రో కబడ్డీ లీగ్ లో భాగంగా ఇటీవలే ముంబై వేదికగా రెండు రోజులపాటు వేలం జరిగింది. ఇక ఈ వేలం లో భాగంగా ప్రో కబడ్డీ లీగ్ ఆటగాళ్లు ఐపీఎల్ తరహాలోనే కోట్ల రూపాయల ధర పలకడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 మొత్తం 12 జట్లు 500 మంది ప్లేయర్స్ ని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డాయి.  ఇక ఈ మెగా వేలంలో పవన్ శరావత్ 2.65 కోట్ల కి రికార్డు స్థాయిలో ధర పలికాడు. తమిళ్ తలైవాస్ అతని దక్కించుకుంది. ఇక వికాస్ కండోలాను 1.70 కోట్ల కు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేయడం గమనార్హం. ఫజల్ అట్రాజలి ని పుణేరి పల్టాన్ 1.38 కోటకు దక్కించుకుంది. యు ముంబా గుమన్ సింగ్ ను 1.21 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే రికార్డు బ్రేకర్ గా పేరొందిన పర్దీప్ నర్వాల్ మాత్రం 90 లక్షలకు యూపీ హోదా దక్కించుకోవడం గమనార్హం. ఇక ఈ మెగా వేలం గురించి తెలిసిన అభిమానులు అందరూ కూడా ప్రో కబడ్డీ ఎప్పుడు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూడటం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: