స్మృతి మందాన విధ్వంసం.. అరుదైన ప్రపంచ రికార్డు?
ఏకంగా ఇంగ్లాండ్ బౌలర్లపై వీరవిహారం చేసింది అనే చెప్పాలి. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది స్మృతి మందన కాగా అంతర్జాతీయ టీ20ల్లో ఒక అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది అన్నది తెలుస్తుంది. అంతర్జాతీయ టి20లో నాకౌట్ మ్యాచులలో ఇదే వేగవంతమైన అర్థశతకం కావడం గమనార్హం. అయితే గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లన్నింగ్ పేరిట ఉండేది. 27 బంతుల్లో అర్ధసెంచరీ చేసి అత్యంత వేగంగా అర్థ సెంచరీ చేసిన రికార్డు క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుతం మృతి మందాన తన ప్రదర్శనతో ఈ రికార్డును బద్దలు కొట్టింది.
అయితే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మృతి మందాన విధ్వంసానికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం వణికిపోయింది అని చెప్పాలి. అయితే మొత్తంగా 32 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేసిన మృతి మందాన టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర వహించింది అని చెప్పాలి. అయితే సెమీఫైనల్ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును తమ బౌలింగ్‌తో కట్టడి చేసేందుకు సిద్ధమైంది టీమిండియా.