టీమిండియాలోకి అతన్ని తీసుకోవడం.. ఆశ్చర్యం కలిగించింది?

praveen
టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్ స్టార్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం వైట్ బాల్ క్రికెట్కు రవిచంద్రన్ అశ్విన్ అంతకంతకూ దూరం అవుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ పేరు ప్రేక్షకులు కూడా మరిచి పోతున్నారు. ఇలాంటి సమయంలో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి వైట్ బాల్ క్రికెట్ లో అవకాశం దక్కించుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. గతంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ లో వైట్ బాల్ క్రికెట్ లో తన చివరి మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు.

 అయితే అంతకుముందు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లతో జరిగిన సిరీస్లకు రవిచంద్రన్ అశ్విన్ ను పట్టించుకోని బీసీసీఐ సెలెక్టర్లు..  వరల్డ్ కప్ కొన్ని రోజుల ముందు మాత్రం మళ్ళీ టీ20 క్రికెట్ లోకి అతని పరిగణలోకి తీసుకోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు కుల్దీప్ యాదవ్ గాయాలతో బాధ పడుతూ ఉండటం.. మరోవైపు చాహల్ రాణిస్తున్న ఎక్కువ పరుగులు సమర్పించుకుంటూ ఉండటంతో అశ్విన్ ను టి20 వరల్డ్ కప్ లో ఆడించేందుకు బిసిసిఐ సెలెక్షన్ కమిటీ సన్నాహాలు చేస్తుందని ప్రచారం కూడా మొదలైంది. ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు.

 అశ్విన్ విషయంలో నాకు క్లారిటీ రావడం లేదు. అతన్ని ఎందుకు పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు టీ-20 జట్టుకు ఎంపిక చేశారు. టీమిండియాకు ప్రధాన స్పిన్నర్ జడేజా. తర్వాత పొజిషన్ కోసం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ పోటీ పడుతున్నట్లు ఉంది. ఇక వీరిలో టి20 వరల్డ్ కప్ లో ఎవరికీ ప్లేస్ దక్కవచ్చు.. చాహల్ ని పక్కనపెట్టి అశ్విన్ ను తీసుకుంటారా.. అశ్విన్ లో ఆల్రౌండర్గా సత్తా ఉండటం వల్ల అతనికి అవకాశాలు ఇస్తున్నారంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవలే టి20 సిరీస్ లో ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ తన ప్రదర్శన తో అదరగొట్టాడు 6.66 ఎకనామిక్ తో మూడు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: