రోహిత్ దూరమైతే.. కెప్టెన్సీ కోసం ఆ ముగ్గురు పోటీ?

praveen
ఇటీవలే మూడవ టీ20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గాయంపై అందరిలో కలవరం మొదలైంది. ఇలాంటి సమయంలోనే రోహిత్ శర్మ నాలుగో టి20 మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవేళ రోహిత్ శర్మ నాలుగో టి20 మ్యాచ్ దూరమైతే ఇక టీమిండియా కెప్టెన్సీ ఎవరు చేతుల్లోకి వెళ్తుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇప్పటికే జట్టులో ఉన్న రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా,  భువనేశ్వర్ కుమార్ పలుమార్లు టీమిండియా కెప్టెన్సీ చేపట్టారు అన్న విషయం తెలిసిందే. ఇక జస్ప్రిత్ బూమ్రా కి కూడా కెప్టెన్సీ సరదా తీరిపోయింది. అటు రిషబ్ పంత్ కి  ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముందుకు నడిపించిన అనుభవం ఉంది. ఒక వైపు హార్దిక్ పాండ్యాకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వ్యవహరించి టైటిల్ అందించిన అనుభవం ఉంది అని చెప్పాలి. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన సమయంలో రిషబ్ పంత్ కెప్టెన్సీ వహిస్తే.. టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించాడు.

 అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం భువనేశ్వర్ కుమార్ కి బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు భువనేశ్వర్ కుమార్. ఈక్రమంలోనే రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ల లో ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశం లేకపోలేదు అన్నది ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రాహుల్ నాలుగో టి20 లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాక్. ఇదే జరిగితే ఇక కేఎల్ రాహుల్ కు  కెప్టెన్సీ వెళ్లడం కాయం గా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: