ప్చ్.. కేఎల్ రాహుల్ మళ్ళీ మిస్?
అయితే ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం తో జర్మనీ లో శస్త్ర చికిత్స చేయించు కున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే గాయం కారణం గా అటు ఇంగ్లండ్ పర్యటనకు కూడా దూరమయ్యాడు కేఎల్ రాహుల్. ఈ క్రమం లోనే బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ ను అటు వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్లో పరిగణ లోకి తీసుకోలేదు. కనీసం టి20 ఫార్మాట్ లో అయినా కె.ఎల్.రాహుల్ అందుబాటులోకి వస్తాడని అందరు అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే ఈనెల 21వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డాడు కె.ఎల్.రాహుల్.
ఈ క్రమం లోనే ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ ఉంటూ వైరస్ నుంచి కోలుకుంటున్నాడు. అయితే వెస్టిండీస్ టీ20 సిరీస్ నేపథ్యం లో ఇప్పటికే కొంత మంది ఆటగాళ్ళు అటు విండీస్ గడ్డపై అడుగు పెట్టారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సిరీస్కు కూడా కె.ఎల్.రాహుల్ దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. అయితే జింబాబ్వేతో ఆగస్టు 18వ తేదీన ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో నే కేఎల్ రాహుల్ పునరాగమనం సాధ్యమయ్యే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది.