ఫామ్ లో లేకున్నా.. టాప్ లో కోహ్లీ.. అదెలా అంటే?

praveen
కోహ్లీ ఒకప్పుడు అత్యుత్తమ ఆటగాడు. ఒకసారి బరిలోకి దిగాడు అంటే చాలు జట్టును విజయతీరాలకు నడిపించగల సత్తా ఉన్నోడు.  కానీ ఇప్పుడు పరుగులు చేయడానికి కూడా తెగ ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి ఆటగాడు కెరియర్లో  ఒక గడ్డు పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోహ్లీ కెరియర్ లో కూడా ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదురైంది. దీంతో అతనిపై విమర్శలు చేస్తున్న వారు రోజురోజుకు ఎక్కువైపోతున్నారూ. అయితే విరాట్ కోహ్లీ ఒకప్పటిలా అద్భుతమైన ఫామ్లో లేకపోయినప్పటికీ మిగతా ఆటగాళ్లతో పోల్చిచూస్తే మరీ దారుణమైన ఫామ్ లో లేడని మాత్రం ప్రస్తుతం అతని గణాంకాలు చెబుతున్నాయి.


 ఎవరు నమ్మలేని విషయం ఏమిటంటే 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ కావడం గమనార్హం. సెంచరీ చేయకపోయినా అత్యధిక పరుగుల జాబితాలో టాప్ లోనే ఉన్నాడు. ఇప్పటివరకు 2019 ప్రపంచకప్ తర్వాత 83 మ్యాచ్ లు ఆడాడు. 3524 పరుగులతో టాప్ లో ఉన్నాడు.  రోహిత్ శర్మ 70 మ్యాచ్ల్లో 3318 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 75 మ్యాచ్ లలో 2593 పరుగులు,  కేఎల్ రాహుల్ 57 మ్యాచ్ లలో 2524 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 64 మ్యాచ్ లలో 2124 పరుగులు సాధించి తర్వాత స్థానాల్లో ఉన్నారు.


 ఈ గణాంకాలు చూసుకుంటే కోహ్లీ మరీ అంత బ్యాడ్ ఫామ్ లో లేడు అని అర్థమవుతుంది. కానీ అతని పై విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం అంతకు ముందు విరాట్ కోహ్లీ భీకరమైన ఫామ్ లో ఉండటమే. మూడేళ్ల నుంచి  సెంచరీ చేయకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపీఎల్ ద్వారా కోహ్లీ పై మరింత ఒత్తిడి పెరిగింది. ఓ మోస్తారు పరుగులు కూడా రాబట్ట  లేకపోతున్నాడు. దీంతో విమర్శకులకు ఇదే అదునుగా మారి కోహ్లీని వేలెత్తి చూపుతున్నారు. కోహ్లీ ఇటీవలే విశ్రాంతి కూడా ప్రకటించారు  సెలెక్టర్లు. ఏది ఏమైనా కోహ్లీ అంత బ్యాడ్ ఫామ్లో ఉన్నాడని విమర్శలు చేస్తున్నా గణాంకాలు మాత్రం విరాట్ కోహ్లీనే టాప్ బ్యాట్స్మెన్ అన్నది చెప్పకనే చెబుతున్నాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: