టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్లు వాళ్లే : రాబిన్ ఉతప్ప

praveen
విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ భారత కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు అనే విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతలను అయితే చేపట్టాడు గాని విరాట్ కోహ్లీ లాగా పూర్తిస్థాయిలో కెప్టెన్ గా మాత్రం అందుబాటులో ఉండలేక పోతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్సీ రోహిత్ శర్మ తర్వాత ఎవరూ వస్తే బాగుంటుంది అనే విషయంపై గత కొన్ని రోజుల నుంచి వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తోంది. అయితే రోహిత్ తర్వాత సారథులుగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే దానిపై అటు మాజీ కి క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ వెటరన్ బ్యాట్స్మెన్ రాబిన్ ఉతప్ప స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు రోహిత్ శర్మ తర్వాత భవిష్యత్తు కెప్టెన్లు ఎవరైతే బాగుంటుందో అన్న విషయం పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరుకోవడంతో ఇక టీమిండియాకు తదుపరి కెప్టెన్ సిద్దం చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీ వహించడానికి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరైన వ్యక్తి అంటూ రాబిన్ ఉతప్ప అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 ఇటీవలే కరోనా వైరస్ కారణంగా రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనలో కీలకమైన టెస్టు మ్యాచ్ కు దూరం అయ్యాడు. దీంతో జస్ప్రిత్ బూమ్రా తన కెప్టెన్సీ తో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఓడినప్పటికీ బుమ్రా కెప్టెన్సీ అతని ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. జస్ప్రిత్ బూమ్రా టీమ్ ఇండియా తరఫున అత్యుత్తమ వ్యూహాలు తెలిసిన ప్లేయర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతని వ్యూహాలు తప్పకుండా టీమిండియాకు హెల్ప్ అవుతాయి. అందుకే జస్ప్రిత్ బూమ్రా ఇక టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్సీ వహించాలని చెప్పుకొచ్చాడు. టెస్ట్ లకు బుమ్రా గొప్ప కెప్టెన్ కాగలడు వన్డేలకు కె.ఎల్.రాహుల్, రిషబ్ పంత్ బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: