రిటైర్మెంట్ విషయంలో.. మిథాలీ రాజ్ యూ టర్న్?

praveen
భారత దిగ్గజ క్రికెటర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మిథాలీ రాజ్ ఇటీవల తన 23 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత మహిళా క్రికెట్ కు ఎంత గానో గుర్తింపు తెచ్చి పెట్టిన ఒక గొప్ప మహిళా క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మిథాలీ రాజ్ ఇక మూడు ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే 23 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం ఒక భావోద్వేగ పూరిత మైనది. అయితే రిటైర్మెంట్  ప్రకటించినప్పటికీ క్రికెట్ తో  సంబంధాలను కొనసాగిస్తా అంటూ మిథాలీ రాజ్ చెప్పుకొచ్చింది.


 అయితే ఇటీవలే మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ బ్రాడ్ కాస్ట్ లో ఇటీవలే మాట్లాడుతూ మళ్లీ మైదానం లో దిగుతాను అంటూ సూచనప్రాయం గా వెల్లడించారు. వచ్చే ఏడాది కనుక మహిళ ఐపీఎల్ ప్రారంభం అయితే.. తప్పక తాను బరి లోకి దిగుతా అనుకుంటూ మిథాలీ రాజ్ సూత్రప్రాయం గా చెప్పుకొచ్చింది అని చెప్పాలి. ఐపీఎల్ కోసం రీ ఎంట్రీ ఆప్షన్ ఎప్పుడు ఓపెన్ గానే పెట్టుకుంటాను అంటూ ఇక్కడ  వ్యాఖ్యలు చేసింది. అవకాశం వస్తే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా  అన్న ప్రశ్నకు ఈ విధంగా అటు మిథాలీ రాజ్ స్పందించడం గమనార్హం.


 కాగా పురుషుల ఐపీఎల్ తరహా  లోనే మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించాలని బిసిసీఐ ప్లాన్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆరు జట్లతో  ఇక వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ప్రారంభించాలని భావిస్తోంది. మరి మిథాలీ రాజ్  చెప్పినట్టుగానే నిజంగానే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటుందేమో అని అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: