నేడే తొలి వన్డే.. గబ్బర్ మ్యాజిక్ చేస్తాడా?

praveen
ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వరుసగా టి20 వన్డే సిరీస్ లను కైవసం చేసుకున్న టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది టీమిండియా. ఇంగ్లీష్ పర్యటనలో రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్తో పాటు ఐదు టీ20ల సిరీస్ కూడా ఆడబోతుంది టీమిండియా. ఇక శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా ఎలా రాణించ బోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇక వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ లో మునిగితేలి చెమటోడ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రెండు సిరీస్ లను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా. కాగా భారత ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడే ప్రారంభం కాబోతుంది. నేటి నుంచి భారత్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా నేడు రాత్రి 7 గంటలకు తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే గత గణాంకాలు చూసుకుంటే 2006లో వెస్టిండీస్ జట్టు టీమిండియా పై వన్డే సిరీస్లో విజయం సాధించింది.


 అప్పటినుంచి ఇప్పటివరకు భారత జట్టు వెస్టిండీస్ జట్టుపై 11 వన్డే సిరీస్ లలో  విజయఢంకా మోగించడం గమనార్హం. ఈ క్రమంలోనే భారత్ పూర్తి ఆధిపత్యం సాధించింది అనేది తెలుస్తుంది. నేటి నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్లో భారత జట్టు ఎలా రాణిస్తుంది.. శిఖర్ ధావన్ ఎలా జట్టును ముందుకు నడిపిస్తాడు అన్నది మాత్రం ఆసక్తికరం గా మారిపోయింది. సీనియర్లు అందరికీ కూడా విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. దూరదర్శన్, డిడి స్పోర్ట్స్ లైవ్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాబోతుంది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: