ప్యాడ్స్ లేకుండానే క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్.. చివరికి?
ఎందుకంటే బౌలర్ వేసిన బంతి తగలరాని చోట తగిలితే ఇక జరగరాని అనర్థం జరిగిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి బ్యాట్స్మెన్ హెల్మెట్, గార్డ్, గ్లౌస్, పాడ్స్ తోనే మైదానంలో బ్యాటింగ్ చేయడానికి వస్తూ ఉంటారు.. తర్వాత బ్యాటింగ్కు చేయబోయేది తామే అని తెలిసినప్పుడు ముందుగానే ఇవన్నీ కట్టుకొని రెడీగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ బ్యాట్స్మెన్ మాత్రం పాడ్స్ కట్టుకోకుండానే క్రీజులోకి వచ్చాడు.. అతనికి భయం లేదు కాబోలు అందుకే ఇలా చేశాడు అని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే ఎందుకంటే.. అతను ఇలా ప్యాడ్స్ కట్టుకోకుండా వచ్చింది భయం లేకుండా కాదు మర్చిపోయి.
అయితే ఇలా ప్యాడ్స్ కట్టుకోకుండా బ్యాట్స్మెన్క్రీజు క్రిస్ లోకి రావడం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంగ్లాండులోని సౌత్ ఎండ్ సివిక్ క్రికెట్ క్లబ్ కి లో భాగంగా స్థానికంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈ ఘటన జరిగిందిm మార్టిన్ హ్యుగ్స్ అనే బ్యాట్స్మెన్ హడావిడిగా క్రీజులోకి వచ్చాడు. కాళ్లకి ప్యాడ్స్ కట్టుకోవడం మర్చిపోయాడు. క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా. ఇక మరో ఎండ్ లో ఉన్న ఆటగాడు చెప్పేంతవరకు అతనికి ప్యాడ్స్ కట్టుకోలేదు అన్న విషయం గుర్తుకు రాలేదు. విషయం తెలిశాక మళ్ళీ డగౌట్ లో పరిగెత్తి ప్యాడ్స్ కట్టుకొని మళ్లీ వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.