
పాక్ బ్యాట్స్మెన్ అరుదైన రికార్డు.. 93 ఏళ్ల తర్వాత?
ఈ క్రమంలోనే పాకిస్థాన్ జట్టు యువ ఓపెనర్ ఓపెనర్ అబ్దుల్లా షపిక్ 160 పరుగులతో అజేయ సెంచరీతో పాకిస్థాన్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే 160 పరుగులు చేయడం కోసం అతడు 408 ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు ఈ ఆటగాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సమయం పాటు క్రీజ్లో నిలిచినా తొలి బ్యాట్స్మెన్గా అబ్దుల్లా షఫీక్ అరుదైన రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఐదు వందల ఇరవై నాలుగు నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కొంతమంది 1998 లో జింబాబ్వేపై టెస్ట్ సమయంలో శ్రీలంక బ్యాట్స్మెన్ అరవింద డిసిల్వా నాలుగు వందల అరవై నిమిషాల పాటు క్రీజులో ఉండి రికార్డు సృష్టించగా ఇక ఇప్పుడు అబ్దుల్లా షఫీక్ ఆ రికార్డు తిరగరాశాడు.
అదే సమయంలో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అబ్దుల్లా షఫీక్. చేజింగ్ సమయంలో 400 బంతులు ఆడి జట్టును విజయతీరాలకు చేర్పించిన రెండో బ్యాట్స్మన్గా కూడా అబ్దుల్లా షఫీక్ రికార్డు సృష్టించాడు.1928 - 29 లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హెర్బర్ట్ 462 బంతుల్లో 131 పరుగులు సాధించి గెలిపించాడు ఇక ఇప్పుడు అబ్దుల్లా షఫీక్ 93 ఏళ్ల తర్వాత నాలుగు వందలకు పైగా బంతులు ఆడి ఈ రికార్డును సాధించడం గమనార్హం.