రోహిత్ కు రెస్ట్.. కోహ్లీకి టెస్ట్.. టీమిండియా కొత్త కెప్టెన్?

praveen
ఇటీవల ఇంగ్లాండ్ టూర్ ను టీమిండియా ఎంతో దిగ్విజయంగా ముగించుకుంది అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే లేట్ చేయకుండా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరింది. అయితే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్ల  టి20 సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది. అయితే అటు వెస్ట్ఇండీస్ పర్యటన ముగించుస్తుందో లేదో వెంటనే జింబాబ్వే పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది టీమిండియా.



 ఇలా టీ20 ప్రపంచకప్ వరకు తీరికలేకుండా టీమిండియా వరుసగా షెడ్యూల్ కలిగి ఉంది. ఈ క్రమంలోనే జూలై 29 వ తేదీ నుంచి వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టి 20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆగస్టు 18వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఇది ముగిసిన వెంటనే ఆగస్టు 27వ తేదీన ఆసియాకప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే జింబాబ్వే పర్యటనకు అటు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


 అయితే జింబాబ్వే పర్యటన కోసం అటు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగతా సీనియర్ ఆటగాళ్లు అందరికీ కూడా విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉందట. గాయం బారినపడి కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న కె.ఎల్.రాహుల్ కు జింబాబ్వే పర్యటనలో కెప్టెన్ అప్పగించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పేలవా ఫామ్ నేపథ్యంలో వరుసగా విఫలమవుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం జింబాబ్వే  పర్యటనకు పంపించే అవకాశం ఉంది. జింబాబ్వే పర్యటనలో విరాట్ కోహ్లీని ఆడిస్తే అతడు గాడిన పడతాడని సెలెక్టర్లు భావిస్తున్నారట. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ మానసిక ప్రశాంత పొంది.. మళ్ళీ ఫామ్ లోకి రావడానికి చాన్స్ ఉందని.. జింబాబ్వే పర్యటనకు పంపించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి కోహ్లీ రాణిస్తాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: