బాబోయ్.. బూమ్రాకి షాకిచ్చిన న్యూజిలాండ్ పేసర్?

praveen
ప్రస్తుతం టీమిండియాలో జస్ప్రిత్ బూమ్రా కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఐపీఎల్ ద్వారా టీమిండియా లోకి వచ్చిన బుమ్రా ఇక తన ప్రదర్శనతో టీమ్ ఇండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక టీమిండియాకు ప్రస్తుతం కీలక బౌలర్గా డెత్ ఓవర్ల   స్పెషలిస్టుగా కూడా కొనసాగుతున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ఎప్పుడూ బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తు ఉంటాడూ జస్ ప్రీత్ బుమ్రా. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియాను విజయ తీరాల వైపు నడిపిస్తూ ఉంటాడు.


 ఇక ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో అవసరమైనప్పుడు బ్యాట్ తో కూడా రాణించడానికి తాను సిద్ధంగానే ఉంటాను అంటూ మెరుపు ఇన్నింగ్స్తో నిరూపించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా ఇక ఎప్పుడూ ఐసీసీ విడుదల చేసే ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానంలో కొనసాగుతూ ఉంటాడు. అయితే ఇటీవల ఇంగ్లాండ్లో వేదికగా జరిగిన టి20 సిరీస్ లో అదరగొట్టిన బూమ్రా వన్డేసిరీస్ లో కూడా అదేరీతిలో ప్రదర్శన చేశాడు. కానీ మూడో వన్డేలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.


 ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్వన్ స్థానంలో కొనసాగిన జస్ప్రిత్ బుమ్రా ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయాడు అనేది తెలుస్తుంది. ఈక్రమంలోనే జస్ప్రిత్ బూమ్రా కు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ షాకిచ్చాడు. వన్డే ఫార్మాట్ లో  నెంబర్వన్ బౌలర్ గా నిలిచాడు. ఇక బుమ్రా రెండవ స్థానం లోకి పడి పోయాడు. అదే సమయంలో భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. కాగా అటు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సైతం ఇటీవల అద్భుతమైన ప్రదర్శన చేయడంతో వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: