కోహ్లీ కోసం.. సెలెక్టర్లు అలా చేస్తే బెటర్ : రికీ పాంటింగ్

praveen
గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు వరుస సెంచరీలతో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు కనీస పరుగులు కూడా చేయలేకపోతున్నాడూ అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ టీమిండియాకు రోజురోజుకి భారంగా మారిపోతుంది. ఇక కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు కావడంతో మళ్లీ మునుపటి ఫాంలోకి వస్తాడని బీసీసీఐ ఎవరికీ ఇవ్వనని అవకాశాలు అతనికి ఇస్తుంది. అయినప్పటికీ అతను మాత్రం మునుపటి ఫామ్ లోకి రాలేకపోతున్నాడూ అని చెప్పాలి.


 అయితే విరాట్ కోహ్లీ సాధారణంగా మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి ఫామ్ లోకి  వచ్చేందుకు అతని బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు చేసింది టీమిండియా. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ పై స్పందిస్తూన్న మాజీ ఆటగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కొంతమంది కోహ్లీ వైఫల్యంపై విమర్శలు చేస్తూ ఉంటే మరి కొంతమంది కోహ్లీ కి మద్దతుగా నిలుస్తూ అతడు మునుపటి  ఫామ్ లోకి వచ్చేందుకు సలహాలు ఇస్తున్నారు.


 ఇటీవలే విరాట్ కోహ్లీ పేలవమైన ఫాంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు. టి20 ప్రపంచకప్ జట్టులో విరాట్ కు సెలెక్షన్ కమిటీ చోటు కల్పించాలి అంటూ కోరాడు. విరాట్ కోహ్లీ కి బదులు వేరొకరికి జట్టులోకి తీసుకుంటే ఇక కోహ్లీ జట్టులోకి రావడం చాలా కష్టం అవుతుంది చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోసం టాప్ ఆర్డర్లో స్థానాన్ని వదిలిపెట్టాలని బిసిసిఐ సెలెక్షన్ లకు సూచన చేశాడు రికీ పాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: