ఆసియా కప్ శ్రీలంకలో కాదు.. ఎక్కడో తెలుసా?

praveen
ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులు మొత్తం అధ్వానంగా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో శ్రీలంకలో ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించడానికి కూడా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వెనక ముందు ఆలోచిస్తూ ఉన్నాయి. కానీ వచ్చేనెల ఇక శ్రీలంక వేదికగా ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. ఏసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అటు శ్రీలంక ఆసియా కప్ కు ఆతిథ్యం ఇవ్వాల్సి  ఉంది. కానీ అంతలోనే ఆర్థిక సంక్షోభం రావడం అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆసియా కప్ నిర్వహణ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


 అయితే ఇప్పటికే ఎన్నో దేశాలు శ్రీలంక లో ద్వైపాక్షిక సిరీస్ లను విజయవంతంగా ఆడుతున్నాయని.. ఇలాంటి సమయంలో ఆసియా కప్ నిర్వహణపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుంది అంటూ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన్ డిసిల్వా  చేసిన వ్యాఖ్యలు కాస్త కొత్త చర్చకు దారితీశాయి అని చెప్పాలి. తమ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రాజకీయ అనిశ్చితి కారణంగా ఆసియా కప్ శ్రీలంక నుండి వేరే వేదిక కు తరలించే అవకాశం ఉంది అంటూ మోహన్ డిసిల్వా వ్యాఖ్యానించారు.


 ఈ క్రమంలోనే యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశం ఉంది అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సరికొత్త చర్చ మొదలైంది. కాగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు కూడా టీ-20 ఫార్మెట్లో ఆసియా జరగాల్సిఉంది. భారత్తో సహా ఆరు దేశాలు ఆసియా కప్ లో తలపడతాయి అనే చెప్పాలి. టీమ్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లతోపాటు ఒక క్వాలిఫైయర్ జట్టు కూడా ఆసియా కప్ లో ఆడుతుంది. అయితే 2018లో ఆసియా కప్ జరుగగా అప్పుడు భారత్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆసియా కప్  ఎక్కడ నిర్వహిస్తారు అన్న ఉత్కంఠకు  ఎప్పుడు తెరపడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: