సెన్సేషనల్ సూర్య కుమార్.. టి20 ర్యాంకింగ్స్ లో ఎన్నో స్థానం తెలుసా?
ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా టీమ్ ఇండియా టి20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 3వ టి20 మ్యాచ్ లో అయితే ఏకంగా 55బంతుల్లోనే 112 పరుగులు చేసి అదరహో అనిపించాడు. అయితే మూడో మ్యాచ్లో అటు టీమిండియా ఓటమి పాలయింది.అయినప్పటికి సూర్యకుమార్ యాదవ్ సాధించిన సెంచరీ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలిచిన విషయం తెలిసిందే. ఇలా ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో దూసుకుపోయాడు.
ఇక ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఏకంగా ఐదవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అంతేకాదు ఇక భారత జట్టు తరఫున టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాట్స్మెన్ గా సూర్య కుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఇటీవల ఐసీసీ విడుదల చేసిన లిస్ట్ చూసుకుంటే భారత యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ 12వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ 18వ స్థానంలో కొనసాగుతున్నాడు. కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ 19 ర్యాంకింగ్ లో ఉన్నాడు. బాబార్ అజాం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.