టీమిండియా పద్ధతి.. మొదటికే మోసం తెస్తుందేమో : పాక్ మాజీ కెప్టెన్
ఇలా గత కొంత కాలం నుంచి టీమిండియాలో జరుగుతున్న మార్పులు ప్రతి ఒక్కరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుంది అనుకుంటున్న సమయంలో టీమిండియా ఇలాంటి ప్రయోగాలు చేయడం అవసరమా అంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా పెదవి విరుస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అతిగా ప్రయోగాలు చేయడం వల్ల అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించాడు.
ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా రిషబ్ పంత్ ను టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి పంపారు. అయితే రిషబ్ పంత్ మాత్రం లోయర్ డౌన్ లోనే డేంజరస్ బ్యాట్స్మెన్. పవర్ ప్లే లో ఎవరైనా ధాటిగా ఆడి గలుగుతారు. పది మందిలో తొమ్మిది మంది ఓపెనర్లే. కానీ అసలైన గేమ్ మిడిల్ ఓవర్లలోనే ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో 28 పరుగులు చేసిన అవి టాప్ ఆర్డర్లో 30 పరుగుల కంటే ఎంతో విలువైనవి. అతి వ్యూహలు అటు దెబ్బతీస్తున్నాయి. లేదంటే మూడో మ్యాచ్లో కూడా టీం విజయం సాధించేది. ఈ క్రమంలోనే టీమిండియాలో ఆడుతున్న ఆటగాళ్లలో కూడా ఎవరు బాధ్యత తీసుకోవాలి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు.