టీమిండియాతో ధోని.. ఫోటో వైరల్?
వారితో కలిసి దిగిన ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చాడు అని చెప్పాలి. ఇక కాస్త వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంతో కలిసి యూకే టూర్ లో ఉన్నాడు. తన పుట్టిన రోజు కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ని కుటుంబం తో కలిసి వీక్షించాడు. ఇక తన భార్య సాక్షి మహేంద్ర సింగ్ ధోనీతో కేక్ కట్ చేయించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే ఇకపోతే ఇటీవల టి20 సిరీస్లో టీమిండియా అదరగొట్టింది.
వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇలాంటి ఆనందకరమైన సమయంలో అనుకోని అతిథిలా డ్రెస్సింగ్ రూంలోకి వచ్చాడు మాజీ కెప్టెన్ ధోనీ. యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాహల్ తో సహా ఇతర ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బిసిసిఐ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. దిగ్గజం ధోనీ మాట్లాడుతుంటే వినేందుకు చెవులన్ని సిద్ధమేనని బిసిసీఐ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫోటోలన్ని అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయ్.