యువీ తర్వాత పాండ్యానే. హార్దిక్ అరుదైన రికార్డు?

praveen
గత కొంత కాలం నుంచి కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫామ్ లో కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా టీమ్ ఇండియా ఆడిన టి20 సిరీస్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు అనే విషయం తెలిసిందే. బ్యాటింగ్ లో బౌలింగ్ లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శన చేసి తన సత్తా ఏంటో చూపించాడు హార్థిక్ పాండ్య. ఏకంగా 33 బంతుల్లో బ్యాటింగ్లో 51 పరుగులు చేయడంతో పాటు అటు బౌలింగ్ లో ముఖ్యమైన నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఏకంగా 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది.



 అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి   ఒకే మ్యాచ్ లో అర్థ శతకం సాధించడంతో పాటు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండవ భారత ఆటగాడిగా చరిత్రపుటల్లోకేక్కాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇంతకుముందు ఈ రికార్డ్ సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ పేరిట ఉండేది అని చెప్పాలి. 2009లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బౌలింగ్లో బాటిల్లో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 25 బంతుల్లో 60 పరుగులు చేయడంతో పాటు ఇక బౌలింగ్ లో 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.


 ఇన్నాళ్ళ వరకు  ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు అని చెప్పాలి   ఇక ఇన్నాళ్ళ తర్వాత హార్దిక్ పాండ్యా యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసేసాడు.  ఈరోజు జరిగిన టి20 మ్యాచ్ లో ముప్పై మూడు బంతుల్లో 51 పరుగులు చేయడమే కాదు.. నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్య. దీంతో ఇక ఒకే ఇన్నింగ్స్ లో అటు హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా హార్థిక్ పాండ్య అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. కాగా మొదటి టీ20 మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా 1-0 తేడాతో ఆధిపత్యాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: