అప్పుడు కామెంటేటర్ గా.. ఇప్పుడు ప్లేయర్ గా.. అది డీకే అంటే?
మొన్నటికి మొన్న ఐపీఎల్ లో తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించినా దినేష్ కార్తీక తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియా తరపున కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ ప్రదర్శనపై అటు మాజీ క్రికెటర్లు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు ఇండియా ఆడబోయే ప్రతి టీ20 మ్యాచ్ కి కూడా అతన్ని తుది జట్టులో అవకాశం దక్కేలా చూసుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ తో ఇండియా ఆడిన తొలి టి20 మ్యాచ్ లో కూడా అటు కార్తీక్ అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ కు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
టీమిండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న దశలో అదరగొట్టాడు. అయితే గత ఏడాది టీమ్ ఇండియా ఇంగ్లాండ్ లో పర్యటించిన సమయంలో దినేష్ కార్తీక్ ఆ మ్యాచ్‌లకు కామెంటేటర్ గా వ్యవహరించాడు. అయితే నాసిర్ హుస్సేన్, అథటన్ తో కలిసి కామెంట్రీ ప్యానెల్లో తన గొంతుతో మ్యాచ్ ను మరింత రసవత్తరంగా మార్చాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఒకప్పుడు దినేష్ కార్తీక్‌తో కలిసి కామెంట్రీ చేసిన అథటన్ టీ20 మ్యాచ్ కు ముందు దినేష్ కార్తీక్ ను ఇంటర్వ్యూ చేశాడు. దీంతో దినేష్ కార్తీక్ డెడికేషన్ సూపర్ అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.