వారెవ్వా.. క్లీన్ స్వీప్.. టీమిండియా సాధించింది?
అయితే చివరి మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్స్వీప్ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా శ్రీలంక జట్టు పట్టు సాధించి మూడో మ్యాచ్ల విజయం సాధించి పరువు నిలుపుకుంది. అయితే ఇటీవలే వన్డే సిరీస్లో కూడా భారత మహిళల జట్టు ఇదే జోరు కొనసాగించింది.. ఇక వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో అయితే 174 పరుగుల టార్గెట్ ను ఒక వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ప్రపంచ రికార్డును కూడా కొల్లగొట్టింది. అయితే వన్డే సిరీస్ క్లీన్స్వీప్ పై కన్నేసిన టీమిండియా చివరికి విజయం సాధించి శ్రీలంకకు షాక్ ఇచ్చింది.
మూడో వన్డే మ్యాచ్లో భాగంగా టాస్ ఓడిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ 89 బంతుల్లో 75 పూజా 65 బంతుల్లో 56, షాఫాలి వర్మ 50 బంతుల్లో 49 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక జట్టు 47.3 ఓవర్లలో కేవలం 216 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో మూడో మ్యాచ్ లో విజయంతో పాటు అటు ఆతిథ్య శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసింది భారత మహిళల జట్టు. దీంతో ఇక భారత మహిళా క్రికెటర్ల ప్రతిభ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.