
కోహ్లీ అతన్ని అనవసరంగా గెలికాడు : వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన టెస్టు మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ ఏకంగా జానీ బెయిర్ స్టో తో మాటల యుద్ధానికి దిగిన విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలుసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే కోహ్లీతో మాటల యుద్ధం తర్వాత చెలరేగిపోయిన బెయిర్ స్టో ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లీ తనను ఏదో అనడం కారణంగానే జానీ బెయిర్ స్టో ఇక కోపానికి తన బ్యాటింగ్ లో చూపించాడు అంటూ ఎంతో మంది భావించారు. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.
ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ సెటైరికల్ కామెంట్స్ చేసే వీరేంద్ర సెహ్వాగ్ ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ గొడవ గురించి కూడా అదే రీతిలో స్పందించాడు అన్నది తెలుస్తోంది. కోహ్లీ బెయిర్ స్టో తో స్లెడ్జింగ్ చేయక ముందు అతని స్ట్రైక్ రేట్ 21 గా ఉంది విరాట్ కోహ్లీ అతనితో మాటల యుద్ధానికి దిగిన తర్వాత అతని స్ట్రైక్ రేటు ఒక్కసారిగా 150కి పెరిగిపోయింది. పూజారా మాదిరిగా ఎంతో నెమ్మదిగా ఆడుతున్న అతన్ని అనవసరంగా గెలికిన విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ మాదిరిగా మార్చి పరుగులు చేసేలా చేశాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.