ఓటమి అంచుల్లో విలియమ్సన్ టీమ్... అద్భుతం జరిగేనా ?

VAMSI
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇక్కడ ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం వచ్చింది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ముగిశాయి. రెండింటి లోనూ ఆతిధ్య ఇంగ్లాండ్ నే విజయం వరించింది. కనీసం మూడవ టెస్ట్ లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని కివీస్ బరిలోకి దిగింది. కానీ ఈ టెస్ట్ లోనూ కివీస్ గెలిచేలా కనిపించడం లేదు. టాస్ గెలిచిన కివీస్ మొదటి బ్యాటింగ్ తీసుకుంది. అయితే మరో సారి కివీస్ టాప్ ఆర్డర్ ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు కుప్ప కూలడంతో డారిల్ మిచెల్ (109) మరియు కీపర్ బ్లాండెల్ (55) లు ఆదుకోవడం తో 329 పరుగులు చేసింది. 

ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ ఓ బైర్ ష్టో (162) మరియు ఓవర్ టన్ (97) చెలరేగడంతో 360 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఇక కివీస్ రెండవ ఇన్నింగ్స్ లో కీపర్ లాతమ్ (76) , డారిల్ మిచెల్ (56) మరియు కీపర్ బ్లాండెల్ (88) లు రాణించడంతో 326 పరుగులు చేసి 296 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. ఈ లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడి రెండు వికెట్లు కోల్పోయినా... ఆ తరువాత రూట్ 55 మరియు పొప్ 88 పరుగులు చేసి మరో వికెట్ పడకుండా 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి అస్త దూరంలో ఆగారు.  అంతటితో నాలుగవ రోజు ముగిసింది .

ఈ మోజు అయిదవ రోజు ఇంగ్లాండ్ మరో 113 పరుగుల దూరంలో ఉంది. అయితే ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరినీ అవుట్ చేసి కివీస్ విజయానికి  దగ్గర అవుతుందా లేదా ఈ మ్యాచ్ లోనూ ఓడిపోయి క్లీన్ స్వీప్ కు గురవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: