
ఐర్లాండ్ పై విజయం.. హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే?
ఇక టీమిండియా కెప్టెన్గా అటు హార్దిక్ పాండ్యా కూడా మంచి ఆరంభం లభించింది అని తెలుస్తుంది. ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ 2 మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇటీవలే మొదటి టి20 మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి టీ20 మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది టీమిండియా. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో పసికూన ఐర్లాండ్ పై భారీ విజయాన్ని సాధించింది. దీంతో హార్దిక్ పాండ్యా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
కాగా ఐర్లాండ్ పై మొదటి టీ20 మ్యాచ్ లో విజయం సాధించడంపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి టి20 గెలవడం మంచి ఆరంభం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఐర్లాండ్ బ్యాట్స్మెన్ టెక్టర్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు అంటూ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. అయితే జట్టుగా ఈ విజయం చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత మ్యాచ్ లో కూడా గెలుస్తాము అంటూ హార్థిక్ పాండ్య ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈనెల 28వ తేదీన రెండవ టీ20 మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.