కెప్టెన్గా సాధించలేదు.. కానీ కోచ్ గా మాత్రం సాధించాడు?

praveen
ఇటీవలే రంజీ క్రికెట్ చరిత్రలో సరికొత్త ఛాంపియన్  అవతరించింది. ఏకంగా 41సార్లు రంజి ఛాంపియన్గా నిలిచిన ముంబై ని ఓడించి మొట్టమొదటిసారిగా టైటిల్ ను అందుకుంది మధ్యప్రదేశ్. దాదాపు 23 ఏళ్ల క్రితం రంజీ సీజన్లో ఫైనల్ వరకు వచ్చి కేవలం రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకుంది మధ్యప్రదేశ్ జట్టు. కానీ ఇప్పుడు మాత్రం ఫైనల్లో అడుగుపెట్టింది. అటు దిగ్గజ ముంబై జట్టును ఓడించి విజయ ఢంకా మోగించి  టైటిల్ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. మధ్యప్రదేశ్ జట్టు విజయంలో అటు టీమిండియా మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే చంద్రకాంత్ పండిట్ గురించి ఒక విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ఒక క్రికెటర్ గా సాధించలేనిది ప్రస్తుతం చంద్రకాంత్ పండిట్ కోచ్ పాత్రలో మాత్రం అందుకున్నాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ విజేతగా అవతరించింది అని తెలియగానే కన్నీటిపర్యంతమయ్యారు ఆయన. కాగా తమ విజయ రహస్యానికి కారణమైన కోచ్ చంద్రకాంత్ పండిత్ ను తమ భుజాలపై మోసుకుంటూ గ్రౌండ్ మొత్తం తిరిగారు ఆటగాళ్లు

 టీమిండియా లో క్రికెటర్గా అంతగా సక్సెస్ కాలేక పోయాడు చంద్ర కాంత్ పండిట్.  కాని రంజీ కోచ్గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. రంజీ కోచ్గా అడుగు పెట్టిన తర్వాత ముంబైని మూడు సార్లు విదర్భను రెండుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టడం లో కీలక పాత్ర వహించాడు. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ ను మొదటిసారి రంజీ విజేతగా నిలిపాడు. 1998-99 సీజన్లో మధ్యప్రదేశ్ కెప్టెన్గా చంద్రకాంత్ వ్యవహరించాడు. ఫైనల్ వరకు వెళ్లిన మధ్యప్రదేశ్ జట్టు చివరికి ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. అప్పుడు కెప్టెన్గా  సాధించలేకపోయిన చంద్రకాంత్ పండిట్ ఇప్పుడు అదే జట్టుకు కోచ్గా మారీ రంజి టైటిల్ సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: