రంజీ ఫైనల్ కి ముందు.. పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో భాగంగా నేడు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది   దాదాపు 23 ఏళ్ల తర్వాత అటు ఫైనల్లో అడుగుపెట్టింది మధ్యప్రదేశ్.  ఇప్పటివరకు ఒక్క సారి కూడా రంజీ ట్రోఫీ గెలుచుకోని మధ్యప్రదేశ్ జట్టు ఈసారి ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అదే సమయంలో ఇక ఇప్పుడు రంజీ క్రికెట్ చరిత్రలోనే దిగ్గజంగా కొనసాగుతున్న ముంబై మరో సారి సత్తా చాటేందుకు సిద్ధమైంది అనే చెప్పాలి.

 అయితే అటు మధ్యప్రదేశ్ జట్టు తో పోల్చి చూస్తే దిగ్గజం ముంబై జట్టు ఎంతో పటిష్టంగానే కనిపిస్తోంది. అంతేకాకుండా ఇక ముంబయి జట్టుకు ఇప్పటికే ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఫైనల్ మ్యాచ్ ఆడటం అలవాటు అని చెప్పాలి. ఇప్పటికే నలభై ఏడు సార్లు ఫైనల్లో అడుగుపెట్టిన జట్టు 41 సార్లు విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తుంది. అదే సమయంలో సమిష్టి కృషితో ఫైనల్ వరకు చేరిన మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్లో కూడా విజేతగా నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ముంబై జట్టు కెప్టెన్ పృథ్వీ షా  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 క్రికెట్ ఆటలో అయినా జీవితంలో అయినా ఎత్తుపల్లాలు మామూలే అంటూ యువ ఓపెనర్ పృథ్వీషా చెప్పుకొచ్చాడు. అయితే ఈ రంజీ క్రికెట్ లో పృథ్వీ షా ఎందుకో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. అటు ఐపీఎల్ లో మంచి ప్రదర్శన తో ఆకట్టుకున్న పృథ్వీ షా  రంజీ ట్రోఫీలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆటలో అయినా జీవితంలో అయినా ఎత్తుపల్లాలు సహజమే.. అయితే బంతిని మిడిల్ చేస్తూ పరుగులు చేస్తే మళ్లీ గాడిలో పడినట్లే.. ఇప్పుడు నా దృష్టంతా ముంబై నీ రంజీ విజేతగా నిలపడం పైనే ఉంది అంటూ పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: