రంజీ ట్రోఫీ : ఒకవైపు దిగ్గజం.. మరోవైపు పసికూన?

praveen
ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీలో భాగంగా అటు ఫైనల్ మ్యాచ్  భారీ అంచనాల మధ్య జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రంజీ ట్రోఫీ లో దిగ్గజం కొనసాగుతున్న ముంబై ఇక మొదటి సారి ఫైనల్ లో గెలిచి కప్పు కొట్టాలని భావిస్తున్న మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ముంబై  జట్టు ఇప్పటికే నలభై ఏడు సార్లు రంజీ ఫైనల్లో ఆడితే 41 సార్లు టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.  ఇప్పుడు ఈ ఏడాది కూడా ఫైనల్ మ్యాచ్లో గెలిచి తమ విజయాల సంఖ్య 42 కు పెంచుకోవాలి అని ముంబై భావిస్తోంది అని చెప్పాలి.

 అదే సమయంలో ఇక  ఫైనల్ లో అడుగుపెట్టిన మధ్యప్రదేశ్ మొదటిసారి కప్పు కొట్టాలని  భావిస్తూ ఉంది. అయితే 23 ఏళ్ల క్రితం ఒకే ఒకసారి ఫైనల్ చేరింది మధ్యప్రదేశ్ జట్టు. ఫైనల్లో కూడా ఓటమి తోనే సరిపెట్టుకుంది చెప్పాలి. కాగా ఈ రెండు జట్ల మధ్య నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రంజీ ఫైనల్ మ్యాచ్లో భాగంగా రాబోయే ఐదు రోజుల పాటు ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక బలాబలాలను బట్టి చూస్తే ప్రస్తుతం దిగ్గజ ముంబై జట్టు పైచేయిగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇక ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన తో ఫైనల్ వరకు వచ్చిన మధ్యప్రదేశ్  జట్టును అంత సులభంగా ఓటమిని అంగీకరించే ప్రసక్తి కూడా లేదని తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టులో  బ్యాట్స్ మెన్ లదే కీలకపాత్ర కాబోతుంది. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, ఆర్మాన్ జాఫర్, సురేష్ పార్కర్ లాంటివాళ్ళు కీలకపాత్ర వహిస్తారు. ఇక మధ్యప్రదేశ్లో ఇలాంటి స్టార్స్ లేకపోయినప్పటికీ ఇప్పటివరకు సమిష్టి కృషి  జట్టును ముందుకు నడిపించింది.  ఇక ఐపీఎల్ లో సత్తా చాటిన రజత్  ఇక ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో కూడా బాగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా యాష్ దుబే,  శుభమ్ శర్మ,  హిమాన్షు లాంటి క్రికెటర్లలో ఇద్దరు రాణించిన కూడా మధ్యప్రదేశ్ జట్టుకు ఎంతగానో కలసి వస్తుంది అని చెప్పాలి. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ ఇప్పటికి ఇరవై ఏడు వికెట్లు సాధించగా ఫైనల్లో  కూడా అదరగొట్టే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: