బీసీసీఐ ఏం చెబితే.. అదే జరుగుతుంది : ఆఫ్రిది

praveen
ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు గా కొనసాగుతుంది బీసీసీఐ. ఐసీసీకి ఎక్కువ ఫండ్స్ కూడా బిసిసిఐ నుంచి అందుతాయి అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏకంగా ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగింది. ఏకంగా విదేశీ క్రికెటర్లు ఎంతమంది అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 2008లో ఒక సాదాసీదా లీగ్ గా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఇటీవల ప్రసార హక్కుల విషయంలో కనీవినీ ఎరుగని రీతిలో ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2023-27 కాలానికి గాను ప్రసార హక్కుల కోసం 48 వేల కోట్లు ఆర్జించి మరోసారి సత్తా చాటింది.

 ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండవ స్పోర్ట్స్ ప్రాపర్టీ జాబితాలో చోటు సంపాదించుకుంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగమైన ఎంతో మంది క్రికెటర్లు అంటూ ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తరపున కొన్ని అంతర్జాతీయ మ్యాచ్ లకు  దూరం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవలే బిసిసిఐ కార్యదర్శి షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న ఆదరణ దృష్ట్యా.. దీనికోసం ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం క్యాలెండర్ భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 ఇక ఈ విషయంపై అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ తమ సమ్మతమే అయినప్పటికీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాత్రం ప్రభావం చూపుతుందనే వాదనలు  వినిపిస్తున్నాయ్. ఎందుకంటే పాకిస్థాన్ క్రికెటర్లు అటు ఇండియన్ ప్రీమియర్ లో ఆడేందుకు అవకాశం లేదు. ఎందుకంటే వారిపై నిషేధం కొనసాగుతోంది. ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఏం చెబితే ప్రపంచంలో అదే జరుగుతుంది. మార్కెట్ వ్యూహాలు ఎకానమీలో ఇదంతా ఒక భాగం. క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఇండియాది కాబట్టి వాళ్ళు ఏం చెబితే ఇక్కడ అదే జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ పెద్ద బ్రాండ్ గా మారింది.  ఐ పీ ఎల్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు  చోటు లేకపోవడం పెద్ద లోటు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: