అంపైర్ మతిభ్రమించిందా.. ఏం చేసాడో చూడండి?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సిరీస్ లు ఆడుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 3 టి20 సిరీస్ లు జరిగింది. ఇక ఈ టి 20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఇకపోతే ఇటీవల జరిగిన మూడో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా మైదానంలో అంపైరింగ్ చేస్తున్నవారు తమ వైపు బంతి వచ్చింది అంటే వెంటనే పక్కకు తప్పుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవలే ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో మాత్రం ఏకంగా లెగ్ అంపైర్ క్యాచ్ అందుకోబోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో   స్క్వేర్ లెగ్ లో అంపైరింగ్ చేస్తున్నాడు కుమార ధర్మసేన. అయితే కాసేపు తాను అంపైర్   అనే విషయాన్ని మర్చిపోయినట్లు ప్రవర్తించాడు. ఇండియా శ్రీలంక జట్టు తరఫున ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ స్క్వేర్ లెగ్ దిశలో షాట్ ఆడితే.. అది కాస్త లెగ్ అంపైర్  దగ్గరికి వెళ్ళింది.

 ఇలా జరిగినప్పుడు ఏ అంపైర్. అయినా సరే పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఇక్కడ అంపైర్ మాత్రం తాను రిఫరీ అన్న విషయాన్ని మర్చిపోయి క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇక అంతలోనే తాను రిఫరీ  అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని బంతికి అడ్డుపడకుండా పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత నేను ఇలా ప్రవర్తించాను ఏంటి అని తనలో తనే నవ్వుకున్నాడు. సంబంధించిన వీడియో కాస్త ఓవర్ గా మారిపోయింది. అలా ప్రవర్తించిన కుమార ధర్మసేన గతంలో శ్రీలంక జట్టుకు ఆడాడు. 1996లో జరిగిన ప్రపంచ కప్ శ్రీలంక జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇక వరల్డ్ కప్ లో శ్రీలంక టైటిల్ గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: