దినేష్ కార్తీక్ అరుదైన రికార్డు.. 11 మంది కెప్టెన్ల సారథ్యంలో?

praveen
దినేష్ కార్తీక్ ప్రస్తుతం టీమిండియా లో ఉన్న మోస్ట్ సీనియర్ ప్లేయర్. అయితే వయసు మీదపడుతున్న ఇప్పటికీ దినేష్ కార్తీక్ ఆట తీరు మాత్రం అంతకంతకూ మెరుగవుతుంది. మొన్నటి వరకు టీమిండియాలో సరిగా అవకాశాలు రాక.. అవకాశాలు వచ్చిన తనను తాను నిరూపించుకోలేక  ఎంతగానో ఇబ్బంది పడిపోయాడు దినేష్ కార్తీక్. ఇక ఇలా పేలవ ప్రదర్శనతో ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు దూరమయ్యాడు దినేష్ కార్తీక్. కానీ అతనిలో టీమిండియా లోకి రావాలి వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో పేరు సంపాదించాలి అనే ఆశ మాత్రం చావలేదు.

 ఈ క్రమంలోనే దీనికోసమే ఇక ఎంతగానో కఠినంగా శ్రమించాడు. ఇలా భారత్ భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించడం కోసం ఇక ఇటీవల ఐపీఎల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. కాస్త లేటు వయసులో కూడా దినేష్ కార్తీక్ అరుదైన రికార్డులు సాధిస్తు.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో సూపర్ ఫినిషర్ గా మారిపోయిన దినేష్ కార్తీక్ వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు.  ఇటీవలే సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికాతో  ఇండియా ఆడుతున్న సిరీస్లో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ మరికొన్ని రోజుల్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లపోతున్న జట్టులో కూడా ఉన్నాడు.

 ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ ఇటీవలే ఒక అరుదైన రికార్డును సాధించాడు అన్నది తెలుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 11మంది కెప్టెన్లు కింద ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్,వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్రసింగ్ ధోని, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన దినేష్ కార్తీక్ ఇక అఫ్రిది కెప్టెన్సీ లో ఐసీసీ ఎలవెన్ లో కూడా ఆడి 11మంది కెప్టెన్స్ కింది ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో త్వరలో ఐర్లాండ్ పర్యటనలో బరిలోకి దిగిపోతున్న టీమిండియా తరఫున హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. దీంతో దినేష్ కార్తీక్ మొత్తం 12 మంది కెప్టెన్ ల  ఆడిన వ్యక్తిగా నిలువ బోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: