శ్రేయాస్ ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది : జహీర్ ఖాన్

praveen
మొన్నటి వరకు టీం ఇండియాలో ఫ్యూచర్ కెప్టెన్ అంటూ ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. గత కొంత కాలం నుంచి మాత్రం పేలవమైన ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ ఒకవైపు కెప్టెన్గా మాత్రమే కాదు మరోవైపు ఆటగాడిగా కూడా ప్రతి మ్యాచ్లో విఫలమవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఐపీఎల్లో రాణించక పోయినప్పటికీ అతని మీద నమ్మకంతో బీసీసీఐ టీమిండియాలో అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సొంత గడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఆడుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ఒక్క మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్ సరిగ్గా రాణించలేక పోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ పేలవమైన ఫామ్ తో టీమిండియాకు ఎంతో మైనస్ గా మారిపోతుంది. ప్రతి మ్యాచ్లో కూడా భారీ అంచనాల మధ్య శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగడం ఆ తర్వాత తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకోవటం లాంటివి చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై అటు మాజీ ఆటగాళ్లు కూడా పెదవి విరుస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవల శ్రేయస్ అయ్యర్ పేలవా ఫామ్ పై అటు మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లు, మీడియం పేస్ లలో శ్రేయస్ అయ్యర్ బాగా ఎదుర్కొంటున్నాడని కానీ ఫాస్ట్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఫాస్ట్ బౌలింగ్ లోనే వికెట్ సమర్పించుకుంటున్నాడు అని తెలిపాడు. ఇక కేవలం ప్రస్తుతం టీమిండియా తరఫున మాత్రమే కాకుండా గతంలో ఐపీఎల్ లో కూడా 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వచ్చిన బంతులను ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు అని జహీర్ ఖాన్ తెలిపాడు.  ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ లో రన్ రేట్ కూడా బాగా తగ్గిందని. నడుము కంటే పైకి వస్తున్న బంతులను ఎదుర్కోలేక పోతున్నాడు.  దానిపై ప్రాక్టీస్ చేయాల్సి ఉంది అంటూ జహీర్ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: