డాక్టర్లు నడవలేడు అన్నారు.. కానీ సైక్లింగ్ విజేతగా నిలిచాడు?

praveen
మనిషి అనుకుంటే కానిది అసాధ్యమైనది ఏదీ లేదు.. అనుకున్నది సాధించడానికి కేవలం దృఢసంకల్పం పట్టుదల ఉంటే సరిపోతుంది అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకూ ఇది నిజమే అని ఎంతో మంది నిరూపించారు కూడా. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించి ఆదర్శంగా నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అలాంటి యువకుడు గురించి అతను పుట్టగానే ఇక నడవలేడు అంటూ వైద్యులు చెప్పేశారు. అయినప్పటికీ విశ్వాసం కోల్పోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి చివరికి నడవడం కాదు సరికొత్త రికార్డు సృష్టించాడు.

 అతను ఎవరో కాదు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సైకిలిస్ట్ విభాగంలో విజేతగా నిలిచిన అదిల్ అల్తాఫ్. అతని తండ్రి అల్తాఫ్ అహ్మద్  లాల్ బజార్ లో టైలరింగ్ దుకాణం నడుపుతుంటాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అల్తాఫ్ మాత్రం తన ఇష్టాన్ని పక్కన పెట్టలేకపోయాడు. లక్ష్యసాధన కోసం అహర్నిశలు శ్రమించారు. 18 ఏళ్లకే జమ్మూ కాశ్మీర్ తరఫున ఖేలో ఇండియా యూత్ గేమ్ సైక్లింగ్ విభాగంలో పాల్గొన్నాడు. చివరికి అద్భుతంగా ప్రతిభ చాటి ఇక విజేతగా నిలిచాడు. అయితే కాశ్మీర్ హార్వర్డ్ స్కూల్ లో తొలిసారి సైక్లింగ్ ఈవెంట్ లో పాల్గొని విజేతగా నిలిచిన అల్తాఫ్ ఇక తండ్రి దృష్టిని ఆకర్షించాడు. అప్పటినుంచి తండ్రి కూడా కొడుకుని ప్రోత్సహిస్తూ వచ్చాడు.

 ఇక ఆ తర్వాత కాలంలో స్థానికంగా నిర్వహించిన ఎన్నో సైక్లింగ్ ఈవెంట్లలో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు ఈ యువకుడు. ఇటీవలే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సైకిలింగ్ పోటీలో విజేతగా నిలిచి తన పేరు మారుమోగిపోయేలా చేశాడు. అయితే తనకు సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమని చదువ్వును సైక్లింగ్ రెండు సమన్వయం చేసుకుంటూ సాధన చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. రోజు ఉదయాన్నే 4:00 సాయంత్రం 5:00 సాధన చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు అనుకున్నది సాధించాను అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ పోటీలలో గెలిచిన అందుకుగాను 4.5 లక్షలు బైక్ ని దక్కించుకున్నాడు. కాగా ప్రస్తుతం అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: