కోహ్లీని రనౌట్ చేసినందుకు.. రహనేకు థాంక్స్?
ఆ తర్వాత కోహ్లీ సెలవులపై స్వదేశానికి రావడంతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా టీమిండియా గెలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత క్రికెట్లో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోయింది అని చెప్పాలి. అయితే అప్పటీ ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ ఫైన్ అడిలైడ్ వేదికగా రహనే విరాట్ కోహ్లీని రనౌట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 30 పరుగుల వద్ద ఉన్నాడు. లైటింగ్ మొత్తం పోయింది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. కోహ్లీ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మాకేం నష్టం. మ్యాచ్ గడిచేకొద్దీ కోహ్లీ క్రీజ్లో కుదురుకున్నాడు. ఇంకోవైపు రహానే కూడా బాగా ఆడుతున్నాడు. కానీ లక్కీగా రహానే కోహ్లీ ని రన్ ఔట్ చేశాడు. ఇదే గేమ్ చేంజ్ మూమెంట్ గా మారిపోయింది. అప్పుడే మ్యాచ్ నా చేతుల్లోకి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అందుకే ఆనాడు కోహ్లీని రనౌట్ అవుట్ చేసిన రహానే కు థాంక్స్ అంటూ చెప్పాడు టిమ్ ఫైన్.