క్రికెటర్లు డబ్బుకోసం ఆడరు : గంగూలి

praveen
ఒకప్పుడు క్రికెట్ ను క్రికెట్ గా మాత్రమే చూసే వారు. అతి తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ క్రికెటర్లు మాత్రం దేశం కోసం ఆడాలని ఆశతో ఎంతగానో ఇష్టపడుతూ ఉండేవారు. ఇక ఇప్పుడు కూడా ఎంతో మంది క్రికెటర్లు ఇలా దేశం కోసం ఆడాలి దేశ ప్రజలందరూ గర్వ పడేలా చేయాలని క్రికెట్ ఆడుతున్నారు. కానీ చూసే ప్రేక్షకులు మాత్రం నేటి రోజుల్లో క్రికెట్ ఆట అనేది కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అన్నట్లు అర్థం చేసుకుంటూ ఉన్నారు. దీనికి కారణం అటు బిసిసిఐ తెరమీదకు తీసుకువచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం యువ క్రికెటర్లు సైతం తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నారు.



 ఒకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటం ద్వారా మరోవైపు టీం ఇండియా లో తరఫున రాణిం చడం ద్వారా ఇంకోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా.. ఒకసారి ఒక ఆటగాడు క్లిక్ అయ్యాడు అంటే ఇక అతని పై కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది అని చెప్పాలి. అప్పటివరకు మిడిల్ క్లాస్ జీవితం గడిపిన వారు సైతం ఇక ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతున్నారు. ఇలా క్రికెట్ అనేది నేటి రోజుల్లో  మనీ తో కూడుకున్నది అని ఎంతోమంది ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.



 డబ్బు అనేది ఆటతీరు కు సంబంధించినది కాదు అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు డబ్బు కోసం మాత్రమే ఆడరని సమాజంలో మంచి గుర్తింపు కోసం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని గర్వంగా చెప్పుకోవడం కోసం ఆడతారు అంటూ తెలిపాడు. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లాంటి ఆటగాళ్ల కంటే ప్రస్తుత ఆటగాళ్ల సంపాదన చాలా ఎక్కువగానే ఉంది. అయితే ఒకప్పుడు వారి సంపాదన తక్కువ అయినప్పటికీ ఎక్కువ పరుగులు చేయాలి  అనే ఆకలి ఆటగాళ్లలో కనిపించేది అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: