అతనున్నాక.. టీమిండియా ఎలా ఓడిపోతుంది : పాక్ మాజీ క్రికెటర్
ఈ క్రమంలోనే ఇక మూడవ టి20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికాపై ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 9.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలిన పోయింది. ఇక ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. సీనియర్ ఆటగాళ్లు లేకున్నప్పటికీ ద్వితీయ శ్రేణి జట్టు అద్భుతంగా పోరాడుతోంది అంటూ వ్యాఖ్యానించాడు.
టీమిండియాలో సీనియర్లు లేకపోయినా అటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వున్నాడని అందుకే టీమిండియా జట్టు సొంత గడ్డపై అంత తేలికగా ఓడిపోదు అని ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. అయితే 3వ టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా గెలవడంతో ఇక సిరీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది . హర్షల్ పటేల్, చాహల్ అద్భుతమైన బౌలింగ్ తోనే మూడో టి-20లో విజయం సాధ్యమైందని అంటూ చెప్పుకొచ్చాడు. తొలుత సౌత్ ఆఫ్రికా సిరీస్ కైవసం చేసుకుంటుందని అనిపించినా భారత బౌలర్లు దానిని అడ్డుకున్నారంటూ తెలిపాడు ఇంజమామ్ ఉల్ హక్.