వావ్.. భువనేశ్వర్ ఖాతాలో అరుదైన రికార్డు?
ఇకపోతే ప్రస్తుతం ఇండియా సౌత్ఆఫ్రికా తో ఆడుతున్న టీ20 సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ ఎంతో కీలకం గా వ్యవహరిస్తున్నాడు. బౌలింగ్ విభాగం మొత్తం విఫలమవుతున్న సమయంలో ఇక భువనేశ్వర్ మాత్రం వరుసగా వికెట్లు పడగొట్టి అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇటీవల ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి.
అయితే ఇక మూడవ టి20 మ్యాచ్ లో ఎంతో కీలకంగా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. టి20 ఫార్మాట్ క్రికెట్ లో పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్ కుమార్ టాప్ లోకి చేరి పోయాడు. ఈ లిస్టులో వెస్టిండీస్ బౌలర్ శామ్యూల్, టిమ్ సౌదీ లు కూడా ఉన్నారు. ఇక ఈ ముగ్గురు పవర్ ప్లే లో అత్యధికంగా ముప్పై మూడు వికెట్లు తీసిన బౌలర్ లుగా ఉన్నారు. ఇటీవలే భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించడంతో వీరిని దాటి టాప్ ప్లేస్ లోకి దూసుకు పోయాను అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీ-20 ఫార్మెట్లో పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు భువనేశ్వర్ కుమార్.