సచిన్ రికార్డు అతను బ్రేక్ చేయడం కష్టం : గవాస్కర్
ఈ క్రమం లోనే ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జో రూట్ కి సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టడం సాధ్యమయ్యే పని కాదు అంటూ వ్యాఖ్యానించాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం ఎందుకంటే అది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది అంటూ సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఇక సచిన్ రికార్డును అధిగమించాలి అంటే జోరుకి సుమారు గా ఆరు వేల పరుగులు కావాలి. అంటే రాబోయే ఎనిమిదేళ్లలో ఏడాదికి ఎనిమిది వందల నుంచి 1000 పరుగులు చేయాలి.
జో రూట్ వయసు ప్రస్తుతం 31 ఏళ్లు కాబట్టి ముందు ముందు కూడా ఇలాగే ఆడితే చేరుకునే అవకాశం ఉంది. ఆటగాళ్లు నిరంతరం ఆడుతూ ఉంటే ఫామ్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అలాంటి సమయంలోనే శారీరక మానసిక అలసట ఎదురవుతుంది. కానీ క్రికెట్ లో ఏదైనా సాధ్యమే అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇలా ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఎంతోమంది రికార్డులు బ్రేక్ అయ్యాయి అంటూ తెలిపాడు.