ఛాన్స్ వస్తే.. ధోని బుర్ర చదివేస్తా : దినేష్ కార్తీక్
ఇక అందరూ అనుకున్నట్లుగానే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత లేటు వయసులో టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు దినేష్. ఒకవేళ టీమిండియాలో అద్భుతంగా రాణించాడు అంటే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ లో కూడా అతనికి చోటు దక్కడం ఖాయం అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా లో ఆడుతున్న టి20 సిరీస్ లో దినేష్ కార్తీక్ ప్రదర్శన ఎలా ఉంది అన్న విషయం పైనే ఉంది అందరి చూపు ఉంది అనే చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న దినేష్ కార్తీక్ తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలోనే మీకు ఎగిరి పోవడం ఇష్టమా లేక ఎవరైనా బుర్ర చదవడం ఇష్టమా అంటూ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా వెళ్ళిపోతా.. ఎందుకంటే ఆ ప్రాంతం గురించి ఎంతో విన్నాను. ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుర్ర చదివేస్తాను అంటూ దినేష్ కార్తీక్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఇక మరికొన్ని ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానం చెప్పాడు ఈ సీనియర్ ప్లేయర్..