టీమిండియాలో అతను ప్రమాదకరం : రికీ పాంటింగ్
వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ ఎంతో ప్రమాదకరంగా మారుతాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు రికీపాంటింగ్. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా పరుగుల ప్రవాహం కొనసాగించే రిషబ్ పంత్ లాంటి ఆటగాడిని బిసిసిఐ సరిగ్గా వాడుకోవాలి అంటూ సూచించాడు. అయితే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హెడ్ కోచ్గా వ్యవహరించాడు రికీ పాంటింగ్. ఈ క్రమంలోనే ఇక రిషబ్ పంత్ ఆటను ఎంతో దగ్గరుండి గమనించాడు అన్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ ఒక అద్భుతమైన ఆటగాడని.. ప్రపంచాన్ని తన పాదాల చెంతకు తెచ్చుకునే అసాధారణమైన ప్రతిభ గల ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా లోని ప్లాట్ ఫాస్ట్ బౌన్సీ పిచ్ లపై అతను చెలరేగి ఆడగలడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఒకవేళ తానే భారత్ కోచ్ గా ఉండి ఉంటే రిషబ్ పంత్ ఐదవ స్థానంలో ఆడనీస్తాను. కానీ ఒకటి రెండు వికెట్లు పడ్డ సందర్భంలో అతని ముందుకు పంపించాలి. మైదానంలో కుదుర్చుకునేందుకు అతనికి వీలైనంత సమయం ఇవ్వాలి అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్ 14 మ్యాచుల్లో కేవలం 340 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే..