ఓరిదేవుడా ఇదేం ఆటరా అయ్యా.. క్రికెట్ లో ఇలా ఎప్పుడు చూసుండరు?
వికెట్ కీపర్ బంతిని ఎంతో సక్రమంగా అందుకున్న తర్వాత కూడా బ్యాట్స్మెన్ లు 3 పరుగులు తీయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఇక ఇలా 3 పరుగులు రావడానికి కారణం వికెట్ కీపర్, బౌలర్లు, ఫీడర్ల మధ్య సమన్వయం లేకపోవడం అన్నది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్లో భాగంగా ఫ్రెక్ బార్బీరియల్ వినోహ్రడి మధ్య మ్యాచ్ జరిగింది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో 10 ఓవర్ల మ్యాచ్ కాస్తా ఐదు ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో భాగంగా తొలుత ఫ్రెట్ బార్బీ రియన్ బ్యాటింగ్ చేసింది.
అయితే చివరి ఓవర్లో భారీగా పరుగులు సాధించాలని ఆ జట్టు బ్యాట్స్ మెన్స్ భావించారు. ఈ క్రమంలోనే బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ మిస్ చేసాడు. బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ చేతిలో పడింది. అయితే బ్యాట్స్మెన్ పరుగుకు ప్రయత్నించడంతో కీపర్ త్రో చేస్తాడు. బంతి మిస్ కావడంతో ఒక పురుగు వచ్చింది. ఇంతలో మరో ట్విస్ట్ కీపర్ వేసిన బంతిని అవతలి ఎండ్ లో ఉన్న బౌలర్ అందుకోవడంలో విఫలం కావడంతో బ్యాట్స్మెన్లు మరో పరుగుతీశారు. మరో త్రో వేయడంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగ మూడు పరుగులు కూడా పూర్తి చేశారు. ఇలా ఒక్క పరుగు కూడా లేని చోట 3 పరుగులు చేయడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది..