ఢిల్లీ టీ 20: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కు కోచ్ మొండి చెయ్యి ?
ఇంతకీ ఎవరా ప్లేయర్ అనుకుంటున్నారా ? అతను ఎవరో కాదు ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగి అద్భుతంగా రాణించిన యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్... ఇతని బౌలింగ్ లో పరుగులు చేయడం చాలా కష్టం అని ఇప్పటికే రుజువు చేశాడు. బ్యాట్స్మన్ ఆడుతున్న తీరును బట్టి తన లైన్ అండ్ లెంగ్త్ మార్చుకుని బంతులను సందిస్తాడు. ఇక ఆఖరి నాలుగు ఓవర్లలో ఇతని చేతికి బంతి ఇస్తే... బ్యాట్స్మన్ కు చుక్కలే... మామూలుగా అయితే టీ 20 లలో ఆఖరి 5 ఓవర్లు నుండి హిట్టింగ్ చేస్తారు. అలాంటిది అర్శ్ దీప్ బౌలింగ్ లో హిట్టింగ్ చేయడం చాలా కష్టం... బంతులను యార్కర్ లుగా సంధించి బ్యాట్స్మన్ కి పరీక్ష పెడతాడు. అలా ఇతని ప్రతిభను అందరూ గుర్తించి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇండియా కు ఆడుతాడు అని విష్ చేశారు.
అనుకున్నట్లుగానే సౌత్ ఆఫ్రికా టీ 20 సీరీస్ కు ఎంపికయ్యాడు. అయితే మొదటి మ్యాచ్ లోనే జట్టులో చోటు ఉంటుందని భావించిన ఇతనికి కోచ్ మరియు కెప్టెన్ లు మొండి చెయ్యి చూపారు. ఇతనికి బదులుగా ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ వైపు మొగ్గు చూపారు. మరి తర్వాత మ్యాచ్ లో అయినా అవకాశం దక్కుతుందా అన్నది చూడాలి.