కెప్టెన్సీ రావడంపై.. రిషబ్ పంత్ ఏమన్నాడో తెలుసా?
కేఎల్ రాహుల్ ప్రస్తుతం కెప్టెన్సీకి దూరమైన నేపథ్యం లో ఇక టీమిండియాకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు రిషబ్ పంత్. తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని సరిగ్గా ముందుకు నడిపించలేక తడబడిన రిషబ్ పంత్ ఇక ఇప్పుడు ఎలా ముందుకు నడిపించే పోతున్నాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారి పోయింది అని చెప్పాలి. ఇక పోతే ఇక కె.ఎల్.రాహుల్ గాయం కారణం గా జట్టుకు దూరమవడం తో తనకు కెప్టెన్సీ అవకాశం రావడం పై స్పందించిన రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దేశం తరఫున జట్టుకు కెప్టెన్సీ వహించడం గొప్ప గౌరవం గా భావిస్తున్నాను అంటూ చెప్పు కొచ్చాడు. తాను టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం గొప్పగా అనిపిస్తుంది అంటూ తెలిపాడు. ఇక టీమిండియా కెప్టెన్సీ వహించే అవకాశం కల్పించిన బిసిసిఐకి కృతజ్ఞతలు తెలిపాడు రిషబ్ పంత్. ఇక విజయవంతం గా జట్టును నడిపించేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తాను అని తెలిపాడు. ఇక ప్రతి రోజు నా ఆట తీరును మెరుగు పరుచుకుంటూనే ఉన్నాను అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు..