ఆ సమయంలో నాన్న నా పక్కన ఉంటే బాగుండేది : సిరాజ్

praveen
ప్రస్తుతం టీమిండియా లో మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక ఆటో వాలా కొడుకు స్థాయి నుంచి ఐపీఎల్ కారణం గా ఏకంగా దేశం గర్వించదగ్గ అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అయితే  మొహమ్మద్ సిరాజ్ మొదట టీమిండియా కు అవకాశం దక్కించుకున్న సమయం లో ఊహించని విషాదకర ఘటన అతని జీవితం లో చోటు చేసుకుం.ది అప్పటి వరకు నేనున్నాను అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించినా తండ్రి అనారోగ్యం కారణం గా మృతి చెందాడు.


 అయినప్పటికీ ఇక టీమిండియా తరఫున ఆడాలని తన తండ్రి కలను నెరవేర్చేందుకు తండ్రి అంత్య క్రియలకు వెళ్లకుండానే ఉండిపోయాడు.  ఈ క్రమంలోనే కొండంత బాధ గుండెల్లో దాచుకుని టీమిండియా తరఫున  విజయంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తన తండ్రి చనిపోయినప్పుడు తన దగ్గర లేకపోవడాన్ని గుర్తుచేసుకుని ఎన్నోసార్లు ఎమోషనలయ్యాడు సిరాజ్. ఇటీవలే మరో సారి తన తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు.



 ఆస్ట్రేలియా పర్యటన లో భాగంగా టీమిండియా తరఫున అరం గేట్రం చేసిన సమయంలో తన తండ్రి పక్కన ఉంటే బాగుండేదనీ మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికారిక వెబ్సైట్ కు చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అరంగేట్రం పర్యటన చాలా కష్టం గా సాగింది. అంతకుముందు జరిగిన ఐపీఎల్ సమయంలో మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు నాకు ఆ విషయం చెప్పలేదు. ఆస్ట్రేలియా లో అడుగుపెట్టిన తర్వాత ఆయన మరణ వార్త నాకు తెలిసింది. కానీ నాన్న కోరికలు నెరవేర్చి దేశం గర్వపడేలా చేయాలని అమ్మ  చెప్పడం నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. కానీ నా అరంగేట్రం సమయంలో నాన్న నా పక్కన ఉంటే బాగుండేది అనిపించింది అంటు మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: