రోహిత్ కి విశ్రాంతి అవసరమా : ఆర్పి సింగ్

praveen
టీమిండియా మరికొన్ని రోజుల్లో అటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు జట్లు కూడా ఈ టి 20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక తొలి మ్యాచ్ ఢిల్లీ వేదిక జూన్ 9వ తేదీన ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఐపీఎల్లో రాణించిన ఎంతో మంది యువ ఆటగాళ్లకు టీమిండియాలో స్థానం కల్పించిన బిసిసీఐ ఇటీవలే పూర్తి వివరాలను ప్రకటించింది. ఏకంగా 18 మంది సభ్యులతో కూడిన వివరాలను బీసీసీఐ అధికారికంగా ఇక సోషల్ అసలు ప్రకటించడం గమనార్హం. అయితే అదే సమయంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా షమి మీ లాంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.



 ఈ క్రమంలోనే మొన్నటి వరకు గాయాల కారణంగా అటు టీమిండియాకు దూరమైన రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై కొంతమంది మాజీ ఆటగాళ్లు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఇదే ఈ విషయంపై టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా  టీ20 సిరీస్ ఆడుతుంటే.. రోహిత్ శర్మకు బీసీసీఐ ఎందుకు విశ్రాంతి ఇచ్చిందో అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు.  రోహిత్ కు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ ఈ సిరీస్ ఆడాలని నేను భావిస్తున్నాను. అయితే విశ్రాంతి తీసుకోవాలా వద్దా అన్నది మాత్రం అతని వ్యక్తిగత ఆలోచన అంటూ ఆర్పీ సింగ్ కామెంట్ చేశాడు.


 విశ్రాంతి అనేది అతడు ఎంతో అలసటగా అనుభవిస్తున్నాడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ అతనికి బ్రేక్ అవసరం లేదని నా అభిప్రాయం. ఇక దక్షిణాఫ్రికాతో  జరిగేది సుదీర్ఘ సిరీస్ అని.. అంతే కాకుండా రోహిత్ కెప్టెన్ కాబట్టి  ఈ సిరీస్లో కచ్చితంగా ఆడి ఉంటే బాగుండేది. గత కొన్ని సీజన్లలో రోహిత్ శర్మ 400 పైగా పరుగులు కూడా చేయలేదు. అతడు నిలకడగా కూడా రాణించలేక పోతున్నాడు అంటూ ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ లో 14 మ్యాచ్ లలో 268 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్ శర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: