ఐపీఎల్లో కాయం.. అజింక్య రహానే క్లారిటీ?
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన అజింక్య రహానే మంచి పరుగులు చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే తొడ కండరాలు గాయం బారిన పడటంతో అతనికి గాయం నుంచి కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో అతను చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతని గాయం గురించి బిసిసీఐ ఎలాంటి అప్డేట్ చెప్పకపోవడంతో అభిమానులందరూ ఆందోళనలో మునిగిపోయారు.
ఇకపోతే ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందించిన అజింక్యా రహానే తన గాయం తీవ్రత ఎలా ఉంది అనే విషయంపై స్పష్టత ఇచ్చాడు తొడ కండరాల గాయం నుంచి మళ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని అజింక్య రహానే చెప్పుకొచ్చాడు. గాయం నుంచి వేగంగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో పది రోజులు ఉన్నానని తెలిపాడు. ఇక మళ్లీ ఎన్సీఏ లోకి వెళ్లి అక్కడే చికిత్స తీసుకుంటానని ఇక వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగుతాను అంటూ చెప్పుకొచ్చాడు..