కెప్టెన్సీ భారం.. బ్యాట్స్మెన్ ని చంపేసింది?
అయితే మయాంక్ అగర్వాల్ ఒక మంచి బ్యాట్స్మెన్ అన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది మాత్రం అతను బ్యాట్ తో మెరిసింది ఎక్కడా లేదు. ఇక కెప్టెన్సీలో కూడా విజయం సాధించలేకపోయాడు. ముఖ్యంగా కెప్టెన్సీ భారం మీదపడటంతో మయాంక్ అగర్వాల్ లో ఉన్న బ్యాట్స్మెన్ పూర్తిగా ఒత్తిడి లోకి వెళ్ళిపోయాడు అనే చెప్పాలి. వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్ 13 మ్యాచ్ లలో 196 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో 12 బాషల్లో 441 పరుగులతో దుమ్మురేపిన మయాంక్ అగర్వాల్ ఈ ఏడాది మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు.
ఈ క్రమంలోనే అతని పేలవమైన ఫామ్ పై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. అసలు మయాంక్ అగర్వాల్ కు ఏమైంది అతన్ని చూడగానే నా మది లోకి వచ్చిన మొదటి ప్రశ్న అదే అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి అతను మంచి బ్యాట్స్మన్ అయితే ఐపీఎల్లో కెప్టెన్సీ అతనిలో ఒత్తిడి పెంచింది. చివరికి సారథ్య బాధ్యతలు అతనిలో ఉన్న బ్యాట్స్ మెన్ ను చంపేసాయ్. పంజాబ్ కెప్టెన్ గా మయాంక్ ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్ చేసిన ఫలితం మాత్రం శూన్యం. ఇక కెప్టెన్సీ తలకు మించిన భారం కావడంతో అతని ముఖంలో చిరాకు కోపం స్పష్టంగా కనిపించాయి. అతనికి కెప్టెన్సీ అప్పగించకుండా బ్యాట్మెన్గా స్వేచ్ఛగా ఆడనిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్..