వావ్.. ఆ టీమిండియా క్రికెటర్ పెళ్లి చేసుకున్నాడోచ్?
ఇక అప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించిన వార్త ఎన్నోసార్లు తెరమీదికి వచ్చాయి. దీపక్ చాహర్ మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు చర్చించుకున్నారు. కాని అవి కేవలం వార్తలు గానే మిగిలిపోయాయి. కానీ ఇటీవలే ఇలాంటి వార్త వచ్చింది. ఇక పెళ్లి కార్డు కూడా వైరల్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు దీపక్ చాహర్ పెళ్లి కూడా జరిగిపోయింది. తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ ను కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు దీపక్ చాహర్. ఆగ్రాలోని జేపీ ప్యాలస్ లో వీరి వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.
వివాహం అనంతరం వెడ్డింగ్ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుని.. ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. జయ భరద్వాజ్ నిన్ను మొదటిసారి కలిసినప్పుడే నువ్వు నాకు కరెక్ట్ అని అనిపించింది. ఇక ఇప్పటి వరకూ నా జీవితంలో జరిగిన ప్రతి మూమెంట్ ను ఆనందంగా ఎంజాయ్ చేసాం. మనిద్దరం ఇకపై కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పుడు ఆనందంగా ఉంచుతానని ప్రామిస్ కూడా చేస్తున్నాను నా జీవితంలో బెస్ట్ మూమెంట్ ఇదే.. మీ ఆశీర్వాదాలు ఇవ్వండి అంటూ ఒక నోట్ రాసుకొచ్చాడు దీపక్ చాహర్. ఇక ఈ క్రికెటర్ పెళ్లికి కొంతమంది క్రికెటర్లు హాజరైనట్లు తెలుస్తోంది.