ఆరు నెలలు టీమిండియా ఫుల్ బిజీ.. డీటెయిల్స్ ఇవే?
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన నేపథ్యంలో వరుసగా వివిధ దేశాలకు పర్యటనకు వెళ్లి అన్ని ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాతో సిరీస్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ కోసం సీనియర్లు గా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ లాంటి వాళ్లకు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. అయితే రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న నేపథ్యంలో దాదాపు ఆరు నెలల వరకూ టీమిండియా వరుస సిరీస్ లతో తో బిజీ గా ఉండబోతోందని తెలుస్తోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో అటు ఐదు టీ20 ల సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే 3 టి20 ల కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తుంది. ఇక ఆ తర్వాత జూలై నెల చివరిలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లి అక్కడ మూడు వన్డేల సిరీస్తో పాటు 5 టీ20 సిరీస్.. ఆగస్టులో శ్రీలంకలో రెండు టి20 లు కూడా ఆడబోతుంది అని తెలుస్తుంది . ఇక ఈ సిరీస్ లు ముగిసేలోపే ఆసియా కప్లో పాల్గొన బోతుంది టీమిండియా. ఇది ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడుతుంది. ఇక ఈ అన్ని ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి..