ప్రతిష్ఠాత్మక స్టేడియంకీ.. ఇంత అవమానమా.. అసలేం జరిగిందంటే?
ఇలా ఇంత గొప్ప చరిత్ర కలిగిన లార్డ్స్ మైదానంకు ఇక ఇటీవలే అవమానం జరిగింది. జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగబోతోంది. అయితే ఫార్మర్ తో సంబంధం లేకుండా లార్డ్స్ మైదానంలో ఎప్పుడు 100% టికెట్లు అమ్ముడుపోతాయ్. కానీ మొదటిసారి చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం అటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక్కసారిగా భారీగా ధరలు పెంచడం అన్నది తెలుస్తుంది. దీంతో ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా 20,000 టికెట్లు మిగిలిపోయాయి. గతంలో 100 పౌండ్లు టికెట్ ధర ఉండగా ఇప్పుడు 160 పౌండ్లు ధర పెంచడంతో క్రికెట్ ఫ్రాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనకడుగు వేశారు.
దీంతో ఎప్పుడూ లేనంతగా టికెట్స్ మిగిలిపోయాయి అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంకి ఇది ఒక పెద్ద అవమానం అంటూ చెప్పుకొచ్చాడు. లార్డ్స్ లో టెస్ట్ మ్యాచ్ జరుగుతోందంటే తొలి రోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం టికెట్లు మిగిలిపోయాయి. ఇది భరించలేకుండా ఉంది. టికెట్ ధరలు అంత పెంచడంపై క్రికెట్ బోర్డు మర్మం ఏంటో అర్థం కావట్లేదు అంటూ విమర్శలు గుప్పించాడు మైకెల్ వాన్