రియాన్ పరాగ్ అరుదైన రికార్డ్.. తొలి భారత ప్లేయర్?
అదే సమయంలో కొంతమంది బెస్ట్ ఫీల్డర్లు గా గుర్తింపు సంపాదించుకొన్నప్పటికీ ఐపీఎల్ లో మాత్రం కొన్ని విలువైన క్యాచ్ లను వదిలేసి విమర్శలు మూటగట్టుకున్నారు అని చెప్పాలి. అది సరే గానీ ఇప్పుడు క్యాచ్ ల గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్. దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఏడాది ఐపీఎల్లో తెరమీదికి వచ్చాడు. బాగా రాణిస్తాడు అనుకున్నప్పటికీ ఎందుకొ అనుక్కుంతగా ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. మొత్తం 17 మ్యాచ్ లలో కలిపి 183 పరుగులు మాత్రమే చేసాడు. బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ ఫీల్డింగ్ లో మాత్రం అదరగొట్టాడు అని చెప్పాలి.
మైదానంలో మెరుపు వేగంతో పాదరసంలా కదులుతూ అదిరిపోయే ఫీల్డింగ్ తో పరుగులను సేవ్ చేసాడు. అంతేకాకుండా తన దగ్గరికి వచ్చిన క్యాచ్ లను వదిలిపెట్టకుండా ఒడిసి పట్టాడు అనే చెప్పాలి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అరుదైన రికార్డును సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 17 క్యాచ్‌లు అందుకున్నాడు రియాన్ పరాగ్. ఈక్రమంలోనే ఒక సీజన్లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న రెండో ఆటగాడిగా తొలి భారత ప్లేయర్ గా నిలిచాడు. తొలి స్థానంలో ఏబి డివిలియర్స్ ఉన్నాడు అని చెప్పాలి. 2016 సీజన్లు ఒకే సీజన్లో 19 క్యాచ్ లు అందుకున్నాడు ఏబీ డివిలియర్స్. కిరణ్ పోలార్డ్ 2015 లో 15 క్యాచ్ లు అందుకునీ మూడో స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం.